ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మనోవేధనతో వ్యక్తి ఆత్మహత్య ....

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 04, 2022, 09:58 AM

ఆరిలోవ భరత్ నగర్ వద్ద ఒక వ్యక్తి మనోవేధనతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది.ఘటనకు సంబందించి ఆరిలోవ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దాట్ల యోగానంద వర్మ (39) గత కొంతకాలంగా భరత్ నగర్ లో నివసిస్తున్నాడు. భార్య ఒక ప్రైవేట్ స్కూల్ లో పని చేస్తున్నారు. అయితే మృతుడు డ్రైవర్ గా పని చేస్తూ వుంటాడని, మద్యం అలవాటువుండడంతో అప్పులపాలయ్యాడని తెలిపారు. అప్పుల బాధ భరించలేక గురువారంసాయంత్రం ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు. సీఐ ఇమ్మానియేలు రాజు ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కెజిహెచ్ కు తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa