ప్రకాశం జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో కేటుగాళ్లు సాంకేతిక పరిజ్ఞానానికి సవాళ్లు విసురుతున్నారు. ప్రకాశం జిల్లా నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఎన్నో వన్యప్రాణులకు స్థిర నివాసం. ఈ ప్రాంతంలో ఎన్నో విలువైన ఔషధ మొక్కలతో పాటు వివిధ రకాల కలపకు భాండాగారం అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అడవి సంపదను కాజేసేందుకు కొంతమంది వేటగాళ్లు కేటుగాళ్లు గా మారి అడవి మనుగడను ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నారు.
అడవి ని సందర్శించేందుకు అటవీశాఖ అధికారులు రాత్రనకా పగలనకా ఎంతో జాగ్రత్తగా అటవీ ప్రాంతాన్ని అడవి లో నివసిస్తున్న వన్యప్రాణులను రక్షిస్తున్నారు. ఇక అంతే కాకుండా అడవులను సంరక్షించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అధికారులు వాడుకుంటున్నారు. వన్యప్రాణులను అడవి సంపద ను కాపాడే ఎందుకు అధికారులు అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
ఈ సీసీ కెమెరాలు అడవిలోని వన్యప్రాణులను వేటాడుతున్న వేటగాళ్లు ఆట కట్టించేందుకు అడవి సంపద దోచుకునే దొంగలకు చెక్ పెట్టేందుకే ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నారు. అడవి సంపదను దోచుకునేందుకు మాటువేసి ఉన్న కేటుగాడు మాత్రం దేనికి లెక్క చేయడం లేదు. ఆ సీసీ కెమెరాలను ధ్వంసం చేయడంతో పాటు కొన్నిటిని అపహరించుకుని తీసుకువెళ్తున్నారు. కేటుగాళ్లు చేస్తున్న ఈ చర్యల వల్ల సంబంధిత అధికారులకు తలనొప్పిగా మారింది. కేటుగాళ్ల ను ఆట కట్టించడంలో అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు.
ఇటీవల అటవీ ప్రాంతంలో కొన్ని వన్యప్రాణులను చంపి వాటి మాంసాన్ని విక్రయించుకునే ముఠాలు ఎక్కువైపోయాయి. దీంతో అధికారులు మరింత నిఘా పెంచే ఉద్దేశంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునేందుకు సిద్ధమయ్యారు. అడవులను కాపాడుకునేందుకు డ్రోన్ యంత్రాలను కూడా రంగంలోకి దించేందుకు సిద్ధమవుతున్నారు.
ఇటీవల గిద్దలూరు, శ్రీశైలం, మార్కాపురం సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణులు చంపి వాటి మాంసాన్ని విక్రయిస్తూ పలువురు వేటగాళ్లు పట్టుబడ్డారు. వీరిని వన్య ప్రాణ పరిరక్షణ చట్టం కింద అధికారులు అరెస్టు చేసి కటకటాల పాలు చేశారు. అయితే వేటకు వెళ్తున్న కేటుగాళ్ళు అడవిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల దొంగతనానికి పాల్పడ్డారు.
పట్టుబడ్డ వేటగాళ్ళ లో సీసీ కెమెరాలు దొంగతనానికి పాల్పడ్డ వారు ఎవరైనా ఉన్నారేమో అని అధికారులు కనిపెట్టే పనిలో ఉన్నారు. ఏదిఏమైనా అటవీ ప్రాంతాన్ని సంరక్షిస్తున్న అటవీశాఖ అధికారులను ప్రజలు అభినందిస్తున్నారు. వన్యప్రాణులను వేటాడుతూ అడవి సంపద ను దోచుకుంటున్న కేటుగాళ్ల ఆటలను అటవీశాఖాధికారులు చెక్ పెట్టాల్సిందే అని అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa