ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో సైనికులపై ఆఫ్ఘనిస్తాన్‌లోని ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఐదుగురు పాక్ సైనికులు మృతి చెందారు. "అఫ్ఘనిస్తాన్ లోపల నుండి, అంతర్జాతీయ సరిహద్దు దాటి, కుర్రం జిల్లాలో పాకిస్తాన్ సైనికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు" అని ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ తెలిపింది.అక్కడ ఎదురు కాల్పుల్లో ఐదుగురు పాక్ సైనికులు మృతి చెందారు. పాకిస్థాన్‌లో గత కొన్ని నెలలుగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa