గుంటూరు అమ్మాయిని తెలుగు సినిమా గాయకుడు పెళ్లాడారు. టాలీవుడ్ గాయకుడు, ఇండియన్ ఐడిల్-9 విజేత రేవంత్ కు గుటూరుకు చెందిన అన్విత అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. అన్విత మెడలో రేవంత్ మూడు ముళ్లు వేసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ పెళ్లి వేడుకను కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలోనే గుంటూరులోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరుపుకున్నాడు. పలువురు గాయనీగాయకులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. రేవంత్, అన్వితల నిశ్చితార్థం డిసెంబర్ 24న జరిగింది. పలువురు సినీ ప్రముఖులు రేవంత్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. తన పెళ్లి ఫొటోలను రేవంత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa