నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండల కేంద్రంలో మంగళవారం ట్రాక్టర్ బైకు ఢీకొన్న ఘటనలో వృద్దుడికి గాయాలయ్యాయి. ఈ సంఘటన స్థానిక హెచ్ పీ పెట్రోల్ బంకు వద్ద జరిగింది. ప్రమాదంలో దుత్తలూరు మండలం తిమ్మాపురానికి చెందిన అవినేని శ్రీనివాసులు (65)అనే వ్యక్తికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa