డేరా సచ్ఛా సౌధా మాజీ చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ సన్నిహితురాలు హనీప్రీత్ సింగ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం ఆమెను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్‌లోని పటియాల-జిరాక్‌పూర్ జాతీయ రహదారిపై హనీప్రీత్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. రేపు హర్యానాలో ఆమెను కోర్టులో హాజరుపర్చుతామని అన్నారు. జైలు శిక్ష పడ్డ డేరా బాబాను తప్పించేందుకు ప్రయత్నించిందని హనీప్రీత్‌పై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆమె నేపాల్‌కి పారిపోయిందని, సరిహద్దుల్లో ఉండవచ్చని కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa