బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) అధినేత్రి ఖలీదా జియా అంత్యక్రియలు ఈ రోజు జరగనున్నాయి. ఢాకాలోని జియా ఉద్యానంలో, తన భర్త, మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్ సమాధి పక్కనే ఆమెను ఖననం చేయనున్నారు. ఈ అంత్యక్రియలకు భారత ప్రభుత్వం తరఫున విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ హాజరుకానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఖలీదా జియా మృతిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. 2015లో ఢాకా పర్యటన సందర్భంగా ఆమెతో భేటీ అయిన సందర్భాన్ని గుర్తు చేసుకున్న మోదీ, భారత్-బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాల పురోగతికి ఆమె చేసిన కృషిని ప్రశంసించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa