ఉక్రెయిన్ కు దక్షిణ ప్రాంతంలో ఉన్న నోవా కఖోవ్ కాను నగరాన్ని రష్యా తమ ఆధీనంలోకి తీసుకుంది. ఈ నగరం నుంచే క్రిమియన్ ద్వీపానికి తాగునీటి సరఫరా కొనసాగుతోంది. నగరాన్ని రష్యా బలగాలు స్వాధీనం చేసుకుని, ప్రభుత్వ కార్యాలయాలను ఆక్రమించుకున్నాయని మేయర్ ధృవీకరించారు. ఈ నగరాన్ని స్వాధీనం చేసుకోవడం వల్ల దక్షిణ దిశ నుంచి ఉక్రెయిన్ ను రష్యా ఆక్రమించుకోవడం విజయవంతం అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa