ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మణిపూర్‌లో పోలింగ్ ప్రారంభం..

national |  Suryaa Desk  | Published : Mon, Feb 28, 2022, 10:16 AM

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మణిపూర్ లో పోలింగ్ ప్రారంభమైంది. 2022, ఫిబ్రవరి 28వ తేదీ సోమవారం ఉదయం 7గంటల నుంచి తొలి విడత ఎన్నికల పోలింగ్ స్టార్ట్ అయ్యింది.సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. తొలి విడతలో 5 జిల్లాల పరిధిలో 38 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో 173 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. తొలి విడతలో పలువురు ప్రముఖులున్నారు. సీఎం బీరేన్ సింగ్, ఉప ముఖ్యమంత్రి ఉన్నారు. 20017, 2012లో కాంగ్రెస్ టికెట్, 2017లో బీజేపీ టికెట్ పై సీఎం బీరేన్ సింగ్ గెలిచారు. 2002లో డీఆర్ పీపీ పార్టీ తరపున విజయం సాధించారు.


ఇక ఎన్నికల పోరు విషయానికి వస్తే.. బీజేపీ, కాంగ్రెస్, నేషనల్ పీపుల్స్ పార్టీ, నాగా పీపుల్స్ ఫ్రంట్, జనతాదళ్ తదితర పార్టీలు సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలో పార్టీల కంటే అభ్యర్థులకే ఓటర్లు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మణిపూర్ లో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగింది. కాంగ్రెస్ 54, జేడీయూ 38, ఎన్పీపీ 42 సీట్లలో అభ్యర్థులను దింపాయి. బీరెన్ సింగ్‌ స్వతంత్ర అభ్యర్థి, మరియు మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా. కాగా..గత ఐదేళ్లలో 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి మారారు. ముఖ్యమంత్రి నోంగ్‌థోంగ్‌బామ్ బీరెన్ సింగ్, మాజీ కాంగ్రెస్ నాయకుడు, మణిపూర్‌లో పార్టీ లోపల బలమైన లాబీతో ఐదేళ్లుగా కూటమిని నడిపించగలిగారు. 60 అసెంబ్లీ స్థానాలున్న మణిపూర్ లో ప్రభుత్వ ఏర్పాటుకు 31 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంటుంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 28 సీట్లు కైవసం చేసుకుంది. బీజేపీకి 21 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఎన్ పీపీ, ఎన్ పీఎఫ్ చెరో నాలుగు స్థానాల్లో విజయం సాధించాయి. తృణముల్ కాంగ్రెస్ ఒక్క నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి మరో చోట విజయం సాధించారు. అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ కాదని… ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని గవర్నర్ ఆహ్వానించడం గమనార్హం. మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తీరుపై అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.


ఎన్ పీపీ, ఎన్ పీఎఫ్, ఎల్ జేపీ, స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆయా పార్టీల్లో ఉన్న కీలక నేతలకు మంత్రి పదవులు దక్కాయి. దీంతో చిన్న పార్టీలకు ప్రాధాన్యం పెరిగిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మణిపూర్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల స్థితిలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి తాము మద్దతు ఇవ్వడం జరుగుతుందని రాష్ట్ర జేడీయూ ఇటీవలే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఎలాంటి విమర్శలకు తావివ్వకుండా సొంతంగా మెజార్టీ సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధాన సమస్యగా ఉన్న సైన్యానికి ప్రత్యేక అధికారాల చట్టం.. మణిపూర్‌ రాజకీయాల్లో ఎప్పటినుంచో కీలకపాత్ర పోషిస్తోంది. నాగాలాండ్‌లో ఇటీవల ఆర్మీ.. ఉగ్రవాదులుగా పొరపడి సాధారణ పౌరులను కాల్చిచంపిన ఘటన మణిపూర్ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa