తెనాలి పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఏ ఆర్ టి కేంద్రంలో కాలింగ్ బెల్ వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి బోర్డు కాలిందని, సిబ్బంది అప్రమత్తమై విద్యుత్ సరఫరాను నిలిపివేసి మరమ్మతులు చేశారని సూపరింటెండెంట్ టీ. సౌభాగ్య వాణి తెలిపారు. ఆమె బుధవారం తన చాంబర్లో ఈ వివరాలు వెల్లడించారు. దీనివల్ల రోగులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని ఆమె స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa