మహా శివరాత్రి సందర్భంగా మండలంలోని చిన అరవపల్లిలోని శ్రీబాలకోటేశ్వర స్వామి తిరునాళ్లకు ఈ ఏడాది రూ. 10, 00, 681 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారి కోటేశ్వరరావు తెలిపారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది కంటే రూ. 64 వేలు తగ్గినట్లు చెప్పారు. తెనాలి ఏరియా ఇన్స్పెక్టర్ సీహెచ్ శ్రీనివాస్, ఈవో సాంబశివరావు, ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa