ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీమిండియా పై రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు

sports |  Suryaa Desk  | Published : Wed, Mar 23, 2022, 11:37 AM

టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ జట్టును గొప్పగా నడిపిస్తున్నాడని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్-2022 సీజన్‌ లో భవిష్యత్తులో భారత జట్టు కెప్టెన్ ఎవరనే దానిపై క్లారిటీ వస్తుందని రవిశాస్త్రి జోస్యం చెప్పారు. ప్రస్తుత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గొప్పగా రాణిస్తున్నాడని, రోహిత్‌ తర్వాత బాధ్యతలు చేపట్టబోయే బలమైన కెప్టెన్ కోసం భారత జట్టు వేచి చూస్తోందని రవిశాస్త్రి అన్నారు.


యువ ఆటగాళ్లకు ఇదే గొప్ప అవకాశం అని రవిశాస్రి చెప్పారు. శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌, కేఎల్ రాహుల్‌ వంటి యువ ఆటగాళ్లు కెప్టెన్సీ పోటీలో ముందంజలో ఉన్నారని రవిశాస్త్రి చెప్పారు. ఇక త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్‌ సీజన్‌లో అందరి దృష్టి హార్దిక్‌ పాండ్యపైనే ఉంటుందని అన్నారు. వెన్నెముక గాయం నుంచి కోలుకున్న హార్దిక్‌ ఈ సీజన్‌ లోనైనా బౌలింగ్ చేస్తాడా? మళ్లీ భారత జట్టులో చోటు దక్కించుకుంటాడా? అని ఎదురు చూస్తున్నారని రవిశాస్త్రి చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa