ఆస్ట్రేలియన్ టెన్నిస్ క్రీడాకారిణి, ప్రస్తుత ప్రపంచ నం.1 ఆష్లీ బార్టీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. టెన్నిస్ నుంచి రిటైర్ అవుతున్నట్లు బుధవారం ప్రకటించింది. సోషల్ మీడియాలో బుధవారం పోస్ట్ చేసిన ఎమోషనల్ వీడియోలో బార్టీ తన నిర్ణయాన్ని తెలిపింది. తాను చాలా సంతోషంగా ఉన్నానని, తన నిర్ణయం సరైనదని భావిస్తున్నానని పేర్కొంది. ఆస్ట్రేలియాకు చెందిన ఆమె తన సొంతగడ్డపై ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలుచుకున్న రెండు నెలలకే రిటైర్మెంట్ ప్రకటన చేసింది. దాదాపు 44 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై ఆస్ట్రేలియా ఓపెన్ సాధించిన మహిళగా రికార్డు సృష్టించింది. ఈ 25 ఏళ్ల టెన్నిస్ తార మూడు గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిళ్లను గెలుచుకుంది. 2019లో ఫ్రెంచ్ ఓపెన్, 2021లో వింబుల్డన్ ఓపెన్, 2022లో ఆస్ట్రేలియా ఓపెన్ ఆమె ఖాతాలో ఉన్నాయి. అయితే 25 ఏళ్లకే, అందులోనూ ప్రపంచ నం.1గా ఉన్న సమయంలో రిటైర్మెంట్ ప్రకటించడంపై క్రీడాలోకం నివ్వెరబోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa