పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కీలక ప్రతిపాదన చేశారు. విపక్షాలు అవిశ్వాసం వెనక్కి తీసుకుంటే జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తానని ప్రకటించారు. ఏప్రిల్ 3న అవిశ్వాసంపై ఓటింగ్ జరగాల్సి ఉంది. ఈ లోపు ఇమ్రాన్ ఖాన్ ఈ ప్రకటన చేశారు. ఇమ్రాన్ జాతీయ అసెంబ్లీలో తన మెజార్టీని నిరూపించుకోవడం దాదాపు అసాధ్యం అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విషయాన్ని ప్రతిపక్ష నేత షహబాజ్ షరీఫ్‌కు చేరవేసింది ఇమ్రాన్ ఖాన్ టీమ్… అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభానికి ముందు సమావేశమైన ప్రతిపక్షాలు.. తాజా పరిస్థితులపై చర్చించాయి.. ఇదే సమయంలో ఇమ్రాన్ ఖాన్ ఓ రహస్య లేఖ ద్వారా ఆ ఆఫర్‌ను వారి దృష్టికి తీసుకెళ్లారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa