ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గాలిలో ఢీకొన్న ఎయిర్ ఫోర్స్ విమానాలు

international |  Suryaa Desk  | Published : Fri, Apr 01, 2022, 03:54 PM

ద‌క్షిణ కొరియాకు చెందిన రెండు వైమానిక ద‌ళ విమానాలు గాలిలోనే ఢీకొన్నాయి. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు పైలెట్లు మృతిచెందారు. రాజ‌ధాని సియోల్‌కు 300 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న సాచియాన్ న‌గ‌రంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. కేటీ-1 ట్రైన‌ర్ జెట్ ఢీకొన్న‌ట్లు మిలిట‌రీ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. శిక్ష‌ణ స‌మ‌యంలో గాలిలోనే రెండు కేటీ-1 విమానాలు ఢీకొన్న‌ట్లు ర‌క్ష‌ణ‌శాఖ కార్యాల‌యం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ప్ర‌మాదంపై ద‌ర్యాప్తు చేప‌ట్ట‌నున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఇటీవ‌ల ఎఫ్‌-35 ఫైట‌ర్ జెట్ కూడా ప్ర‌మాదానికి లోనైంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa