చట్టం అందరికీ సమానంగా అమలు చేయడం పోలీసుల విధి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. ప్రజాస్వామ్యం-దర్యాప్తు సంస్థల పాత్ర, బాధ్యతల అంశంపై ప్రసంగించిన ఆయన.. 'ప్రజాస్వామ్యంపై ఆధిపత్యం చలాయించాలని ఎవరూ చూడకూడదు. నేరాల నిరోధానికి పోలీసులు నిస్పక్షపాతంగా పనిచేయాలి. దర్యాప్తు సంస్థలకు మంచి నాయకత్వం చాలా ముఖ్యం. తరచూ పోలీసుల బదిలీలతో దర్యాప్తులు ప్రభావితమవుతున్నాయి' అని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa