ఐపీఎల్ 2022 సీజన్లో ఈ రోజు రాత్రి 7. 30గంటలకు, పూణే లోని MCA స్టేడియంలో 10వ మ్యాచ్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్లో జరిగిన తమ తమ తొలి మ్యాచ్ లలో ఈ రెండు జట్లు కూడా పెద్దగా కష్టపడకుండానే విజయాన్నందుకున్నాయి. నేడు జరగబోయే మ్యాచ్ లో ప్రత్యర్థి పై గెలుపొంది సక్సెస్ ను కంటిన్యూ చేయాలనుకుంటున్నాయి ఢిల్లీ, గుజరాత్ జట్లు. ఈ మ్యాచ్ లో ఢిల్లీ జట్టులో మార్పులు చోటుచేసుకోనున్నాయి. బౌలర్ కమలేష్ నాగరకోటికి బదులు ముస్తాఫిజుర్ రెహ్మాన్, లుంగి ఎన్గిడి లలో ఎవరికైనా అవకాశం రావచ్చు. తొలి మ్యాచ్ల్లో డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ లేని లోటు ఈ మ్యాచ్‌లోనూ కనిపించనుంది. ఇకపోతే... హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ జట్టు తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకుంది. మహ్మద్ షమీ, రషీద్ ఖాన్ సారథ్యంలో ఆ జట్టు ఫాస్ట్, స్పిన్ బౌలర్లు, ఇంకా తొలి మ్యాచ్ లో నిరాశపరిచిన శుభ్ మన్ గిల్, విజయ్ శంకర్ ల ఆటతీరు గుజరాత్ జట్టు విజయాన్నందుకోవడంలో కీలకపాత్ర పోషించనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa