ట్రెండింగ్
Epaper    English    தமிழ்

122 ఏళ్ల తరువాత మార్చి నెలలో ఎండ తీవ్రత ఇలా

national |  Suryaa Desk  | Published : Sat, Apr 02, 2022, 03:36 PM

మార్చి నెలలోనే ఎండలు ఇలా ఉన్నాయి..మరి ఏప్రిల్, నెల అంటనే జనం భయపడుతున్నారు. ఈ ఏడాది ఎండలు మార్చి నుంచి ఠారెత్తిస్తున్నాయి. వాస్తవానికి ఈ వేసవి సీజన్ కూల్ గా ఉంటుందంటూ భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనాలు వేయగా.. అవి బోల్తా కొట్టాయి. ఐఎండీ అంచనాలకు భిన్నంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రికార్డులను బద్దలు చేసే ఉష్ణోగ్రతలు ఈ ఏడాది మార్చిలో నమోదైనట్టు ఐఎండీ ప్రకటించింది. 1901 తర్వాత 122 ఏళ్లలోనే మార్చి నెలలో ఇంతటి వేడి వాతావరణం నమోదు కావడం ఇదే మొదటి సారి అని పేర్కొంది. 2022 మార్చి నెలలో సగటు ఉష్ణోగ్రతలు 33.1 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. పొడి వాతావరణం ఎక్కువ రోజుల పాటు ఉండడమే వేడి పెరగడానికి కారణంగా తెలిపింది. ఏప్రిల్ 3 నుంచి 6 మధ్య తీవ్ర వడగాలుల రిస్క్ ఉంటుందని అంచనా వేసింది. అందుకనే మధ్యాహ్న సమయంలో అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లొద్దంటూ వాతావరణ శాఖ ఇప్పటికే సూచించడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa