సీమ రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కలిగిన మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ప్రస్తుతం రాజకీయంగా ఎటువెళ్లినా ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. జిల్లాలోని రెండు, మూడు నియోజకవర్గాలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును, క్యాడర్ ను ఏర్పరుచుకున్న బైరెడ్డి నేడు రాజకీయంగా నిలదొక్కుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు.
నందికొట్కూరు నియోజకవర్గం నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయనకు నందికొట్కూరు ఎస్సీ రిజర్వేషన్ కావడం, రాష్ట్ర విభజన అనంతరం
రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం చేయాలంటూ 2013లో రాయలసీమ పరిరక్షణ సమితి పేరిట పార్టీని స్థాపించడం, సీమ మొత్తం పర్యటనలు చేసి ప్రజలను జాగృతి చేస్తున్న వేళ 2014 ఎన్నికలకు ముందు సాయి ఈశ్వరుడి హత్య కేసు ఆయనకు చుటుకోవడం, 2019 ఎన్నికలో అంతవరకు ప్రత్యర్ధులుగా ఉన్న వారికే టిడిపి తరుపున ప్రచారం చేయాల్సిరావడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడం, అక్కడ కుదురుకోలేక ఏడాది తిరగకముందే బిజెపిలో జాయిన్ కావడం, ప్రస్తుతం బిజెపిలో ఇమడలేక పోవడం చూస్తే దాదాపు గత రెండు దశాబ్దాలుగా బైరెడ్డి రాజకీయంగా నిలదొక్కుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏవీ సఫలీకృతం కావడం లేదనే చెప్పవచ్చు.
మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాజకీయంగా నిలదొక్కుకునేందుకు తన పయనం ఎటు కొనసాగించాలో బలమైన నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైంది. 2024 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యాన ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాలంటే ఇప్పటి నుండే వ్యూహరచన గావించాలి. ప్రజలలో ఆదరణ లేని పార్టీల చెంతన ఉండి ఎంత పోరాడినా ఎన్నికలు వచ్చేసరికి అవి ఓటు రూపంలో పడటం లేదనే సంగతి తెలిసిందే. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహా ప్రధాన పార్టీలన్నింటిలో పనిచేసిన బైరెడ్డి ప్రస్తుతం బిజెపిలో అంటీ అంటనట్లు ఉన్నారు. మరోవైపు శ్యాప్ ఛైర్మన్ సిద్ధార్థరెడ్డి వైసిపిలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పాటుచేసుకోవడం, బాబాయ్, అబ్బాయ్ ల మధ్య కొంత గ్యాప్ ఉండటంతో వైసిపిలో చేరి ఇద్దరు కలిసి పని చేసే పరిస్థితులు కనిపించడం లేదు.
ఇప్పటికే వీరిద్దరూ తమకు కేటాయించాలంటూ పార్టీ అధినేత చంద్రబాబు వద్ద పోటీ పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో బైరెడ్డి టిడిపిలోకి వచ్చినా నంద్యాల పార్లమెంట్ లో ఎంపిగా పోటీచేసేందుకు ముందుకు రావాల్సిందే తప్పా ఎమ్మెల్యేగా పోటీచేసేందుకు టిడిపి తరుపున దాదాపు అవకాశాలు లేనట్లే. దాదాపు మూడు నియోజకవర్గాల్లో బలమైన క్యాడర్, నాయకత్వ ప్రతిభ కలిగిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాజకీయంగా నిలదొక్కుకోవాలంటే టిడిపి లేదా వైసిపి వంటి ప్రధాన పార్టీల చెంత చేరితేనే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాన్ని ఆయన అనుచర వర్గం వ్యక్తం చేస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa