ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అపద్దర్మ ప్రధానిగా గుల్జార్ అహ్మద్...ప్రతిపాదించిన ఇమ్రాన్ ఖాన్

international |  Suryaa Desk  | Published : Mon, Apr 04, 2022, 09:18 PM

పాకిస్తాన్ లోని రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. పాకిస్థాన్ ఆప‌ద్ధ‌ర్మ ప్ర‌ధానిగా గుల్జార్ అహ్మ‌ద్ పేరును ఆ దేశ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ ప్ర‌తిపాదించారు. ఈ మేర‌కు ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్‌ తెహ్రీక్ ఇన్సాఫ్ (పీటీఐ) కీల‌క నేత ఛౌధురీ ఫ‌వ‌ద్ హుస్సేన్‌ కాసేప‌టి క్రితం ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.  గుల్జారీ అహ్మ‌ద్ పాకిస్థాన్ సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ప‌ని చేసి ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో రిటైర్ అయ్యారు. క‌రాచీకి చెందిన గుల్జార్‌.. 2019లో పాక్ చీఫ్ జ‌స్టిస్‌గా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టి..రెండేళ్ల పాటు ఆ ప‌ద‌విలో కొన‌సాగారు. పాక్ జాతీయ అసెంబ్లీని ర‌ద్దు చేసిన ఆ దేశ అధ్య‌క్షుడు అరిఫ్ అల్వీ దేశానికి ఆప‌ద్ధ‌ర్మ ప్ర‌ధానిగా ఎవ‌రినో ఒక‌రిని ప్ర‌తిపాదించాలంటూ ఇటు ఇమ్రాన్‌తో పాటు అటు విప‌క్ష నేతకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్ర‌మంలోనే గుల్జార్ అహ్మ‌ద్ పేరును ఇమ్రాన్ ప్ర‌తిపాదించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa