పురపాలక సంఘం పరిధిలో ఉన్న నరసరావుపేట పట్టణానికి సరఫరా చేసే రక్షిత మంచి నీరు గత మూడు రోజుల నుండి పసుపు రంగులో రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పేద మధ్య తరగతి ప్రజలు త్రాగునీరు గా ఉపయోగించే రక్షిత మంచినీరు రంగు మారి ఉండటంతో భయాందోళనకు గురి అవుతున్నారు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. అధికారులు తక్షణమే స్పందించి త్రాగునీరు పై ప్రకటన చేయాలని ప్రజలు కోరుతున్నారు.