ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నారా లోకేష్ సహకారంతో మంగళగిరిలో చలివేంద్రం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 06, 2022, 12:49 PM

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహకారంతో మంగళగిరి పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద ఎన్టీఆర్ మరియు ఎం ఎస్ ఎస్ విగ్రహాల వద్ద బుధవారం చలివేంద్రం తెలుగుదేశం పార్టీ నాయకులు చలివేంద్రాన్ని ప్రారంభించారు. రోజురోజుకీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని మంగళగిరి పట్టణం లో పాదచారులు, వాహన దారులు, ప్రయాణికులు, ప్రజలు తాగునీటి కోసం ఎటువంటి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో చలివేంద్రాన్ని ప్రారంభించినట్లు నేతలు తెలిపారు. తొలుత ఎంఎస్ఎస్, ఎన్టీఆర్ విగ్రహాలకు పూల మాలలు వేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు దామర్ల రాజు, రూరల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తోట పార్ధసారధి, మంగళగిరి నియోజకవర్గ తెలుగుమహిళ అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి లు చలివేంద్రం ప్రారంభిగా ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సీనియర్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa