ఐపీఎల్ 2022 సీజన్ 15లో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబైపై భారీ తేడాతో కోల్‌కతా విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా 16 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ముంబైపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోల్ కతా బ్యాట్స్ మెన్లలో ఓపెనర్ వెంకటేష్ అయ్యర్, పాట్ కమిన్స్ అర్ధ సెంచరీలు చేసారు.కమిన్స్ 15 బంతుల్లో 56 పరుగులు చేశాడు.వెంకటేష్ అయ్యర్ 41 బంతుల్లో 50 పరుగులు చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa