ఐపీఎల్ 15వ సీజన్ లో భాగంగా బుధవారం కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై టీం 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. అనంతరం 162 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన కేకేఆర్ 16 ఓవర్లలో టార్గెట్ ను చేధించింది. ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ 50* పరుగులతో రాణించగా, ఆల్ రౌండర్ కమ్మిన్స్ 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి కేకేఆర్ కు విజయాన్ని అందించాడు. ఈ టోర్నీలో ముంబై కి ఇది వరుసగా మూడో ఓటమి.