ఓ మహిళ కిడ్నీ ఇన్‌ఫెక్షన్ చికిత్స కోసం ఆస్ప్రతికి వెళ్లింది. అయితే ఆమె ఆస్పత్రి నుంచి తిరిగొచ్చేటప్పుడు చంటిబిడ్డతో వచ్చింది. బ్రిటన్ లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. 29 ఏళ్ల రాచెల్ ఫోగార్టీ అనే మహిళ కడుపునొప్పి వచ్చి ఆసుపత్రికి చేరుకుంది. ఆ సమయంలో ఆమెతో పాటు ఆమె తండ్రి కూడా ఉన్నాడు. రాచెల్ సమస్య తెలుసుకునేందుకు మొదట ఆమెను గైనకాలజిస్ట్ పరీక్షించారు. ఆ సమయంలోనే రాచెల్ నొప్పి కడుపు సమస్య కాదని, ఆమెకు ప్రసవ నొప్పి అని డాక్టర్లు తెలుసుకున్నారు. డాక్టర్లు ఆమెను గర్భవతి అని చెబుతున్నా ఆమె అది అబద్దమనే అనుకుంది. కానీ ఆపరేషన్ చేసి వైద్యులు బిడ్డను బయటకు తీసిన తర్వాత ఆమె ఆశ్చర్యపోయింది. రాచెల్ తన భర్తతో 10 ఏళ్లుగా ఉన్నా తాను గర్భవతిని కాదని ఖచ్చితంగా చెప్పింది. బిడ్డను చూసి రాచెల్ కుటుంబ సభ్యులు, ఆమె భర్త ఆనందించారు. ఆమె కిడ్నీ నొప్పి చికిత్స కోసం వెళ్లి ఇలా బిడ్డకు జన్మనివ్వడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు.