ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎండాకాలంలో చద్దన్నం తింటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు

Life style |  Suryaa Desk  | Published : Thu, Apr 07, 2022, 07:51 AM

చద్దన్నాన్ని చాలా మంది చులకనగా చూస్తారు. ఇది పట్టణాలకే కాదు పల్లెలకు పాకింది. ఇప్పటికీ చాలా పల్లెల్లో పొద్దున్నే సద్దెన్నం తింటారు. అందుకే వాళ్లు ఎలాంటి అనారోగ్యాలు లేకుండా వంద సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించారు. కానీ ఇప్పుడు వస్తున్న ఆహారపు అలవాట్ల వల్ల కనీసం 60 సంవత్సరాలు కూడా బతకడం లేదు. సిటీలల్లో అయితే చాలా వరకు రాత్రి అన్నం మిగిలితే ఉదయం పారేయడమో లేదా పనివాళ్ళకి ఇవ్వడమో చేస్తారు. కానీ చద్ది అన్నం తినడం వల్ల ఉన్న ఉపయోగాలు ఏదానికి లేవని కొంతమంది పరిశోధకులు దీని గురించి కొన్ని ఆశక్తికర విషయాలను బయటపెట్టారు. చద్దన్నం వల్ల ఆరోగ్యానికి ఎన్ని ఉపయోగాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.


రాత్రిపూట మిగిలిపోయిన అన్నం ఉదయం తినడం వలన ఆరోగ్యానికి చాల మంచిది. పెద్దల కాలంలో మన తాతలు అవ్వలు సద్దన్నం లో మజ్జిగ కలుపుకొని ఉల్లిపాయ మరియు మిరపకాయ నంచుకుని తినేవారు. అందుకే వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. అంతేకాదు వాళ్లు చాలా సంవత్సరాలు కూడా బతికేవాళ్లు. అన్నంను రాత్రంతా ఉంచడంవల్ల అందులో కొన్ని రకాల మార్పులు చోటుచేసుకుంటాయి. 50 గ్రాముల అన్నంను తీసుకుని రాత్రి పులియపెట్టినట్లయితే 1.6 మిల్లీ గ్రాములు ఉన్న ఐరన్ 35 మిల్లీ గ్రాములుగా పెరుగుతుంది. అలాగే పొటాషియం మరియు కాల్షియంలు కూడా భారీ మొత్తంలో పెరుగుతాయి. ఇవన్నీ మన శరీరాన్ని మరింత ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతాయి. ఎక్కువ సమయం ఉల్లాసంగా ఉండాలంటే ఉదయం సద్దన్నం తినడం చాలా మంచిది. చద్దన్నం శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచుతుంది. శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు చద్దన్నంలో పెరుగు, ఉల్లిపాయ వేసుకుని తింటే ఆ వేడి తగ్గుతుంది. పలు చర్మ వ్యాధులు నుండి కాపాడుకోవచ్చు. మలబద్దకం, నీరసం తగ్గిపోతాయి. బీపీ అదుపులో ఉంటుంది. పేగుల్లో ఉండే అనారోగ్య సమస్యలను సైతం ఈ చద్దన్నం తగ్గిస్తుంది. చద్ది అన్నంలో పెరుగు కలుపు కొని తింటే అనేక ప్రయోజనాలు కలుగుతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa