ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆంధ్రప్రదేశలో ప‌వ‌ర్ హాలిడే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 07, 2022, 10:03 PM

ఆంధ్రప్రదేశలో విద్యుత్ కోత‌లు మొద‌లైపోయాయి. వేస‌వి నేప‌థ్యంలో విద్యుత్ వినియోగం పెరిగిన నేప‌థ్యంలో గృహావ‌స‌రాల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా ఉండేలా ప‌రిశ్ర‌మ‌ల‌కు ప‌వ‌ర్ హాలిడేలు ప్ర‌క‌టిస్తూ ఏపీ సెంట్ర‌ల్ ప‌వ‌ర్ డిస్ట్రిబ్యూష‌న్ కార్పొరేష‌న్ లిమిటెడ్  సీఎండీ హ‌ర‌నాథ‌రావు గురువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు ఏపీఎస్పీడీసీఎల్ ప‌రిధిలోని ప‌రిశ్ర‌మ‌ల‌కు మాత్ర‌మే వ‌ర్తించ‌నున్నాయి.ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ ఆదేశాల ప్రకారం.. 253 ప్రాసెసింగ్ పరిశ్రమలు 50 శాతం విద్యుత్‌ను మాత్రమే వినియోగించాల్సి ఉంది. 1,696 పరిశ్రమలకు వారంలో ఒకరోజు పవర్ హాలిడే అమలు చేయాలి. వారాంతపు సెలవులకు అదనంగా ఒక రోజు-నిడివి పవర్ హాలిడేను కొనసాగించాలి. ఈ నెల 8 నుంచి 22వ తేదీ వరకు రెండు వారాల పాటు అన్ని పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa