ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 07, 2022, 10:22 PM

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. సమావేశం ముగిసిన వెంటనే 24 మంది మంత్రులు తమ రాజీనామా లేఖలను సీఎంకు సమర్పించారు. ఈ నెల 11వ తేదీన కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది. ఏపీ కేబినెట్ ముగిసిన తర్వాత రాజీనామాల సమర్పణపై మంత్రి కొడాలి నాని స్పందించారు. సీఎం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉన్నారని మంత్రి తెలిపారు. మొత్తం 24 మంది మంత్రులు తమ రాజీనామాలను సమర్పించారు. కొత్త మంత్రులు ఏప్రిల్ 11న ప్రమాణస్వీకారం చేయనున్నారు.ఒక ఆలోచన, సిద్ధాంతం కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పనిచేస్తున్నారని కొడాలి నాని కొనియాడారు. కొత్త కేబినెట్‌లో కొనసాగే అవకాశం ఉందా అని కొడాలి నాని ప్రశ్నించగా.. తనకు అవకాశాలు తక్కువేనన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa