ఏపీలో విద్యుత్ కోతలు తీవ్రమవుతున్నాయి. ఆ రంగం, ఈ రంగం అన్ని కాకుండా అన్నింట్లోనూ విద్యుత్ కోతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏపీలో విద్యుత్ కోతలు మొదలైపోయాయి. వేసవి నేపథ్యంలో విద్యుత్ వినియోగం పెరిగిన నేపథ్యంలో గృహావసరాలకు ఇబ్బంది కలగకుండా ఉండేలా పరిశ్రమలకు పవర్ హాలిడేలు ప్రకటిస్తూ ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్పీడీసీఎల్) సీఎండీ హరనాథరావు గురువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని పరిశ్రమలకు మాత్రమే వర్తించనున్నాయి.
ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ ఆదేశాల ప్రకారం.. 253 ప్రాసెసింగ్ పరిశ్రమలు 50 శాతం విద్యుత్‌నే వాడాల్సి ఉంటుంది. 1,696 పరిశ్రమలకు వారంలో ఒకరోజు పవర్ హాలిడేను అమలు చేయాలి. వారాంతపు సెలవుకు అదనంగా ఒక రోజు పవర్ హాలిడేను కొనసాగించాలి. ఈ నెల 8 నుంచి 22 వరకు రెండు వారాల పాటు అన్ని పరిశ్రమలకు పవర్ హాలిడేను ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa