ఈ రోజు సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో చెన్నై బ్యాటింగ్ చేస్తోంది. సన్ రైజర్స్ బౌలింగ్ చేస్తోంది. ఈ సందర్భంగా జట్టులోని ఉమ్రాన్ మాలిక్ ఈ టోర్నీలోనే అత్యంత ఫాస్ట్ బాల్ ను వేశాడు. 9వ ఓవర్లో అంబటి రాయుడు బ్యాటింగ్ చేస్తుండగా ఆ బంతి 153.1 కిలోమీటర్ల వేగంతో నమోదైంది. రాయుడు ఆ బంతిని ఆడటానికి తడబడాల్సి వచ్చింది. మొత్తంగా చూస్తే ఇదే అత్యంత ఫాస్ట్ బాల్ గా రికార్డుకెక్కింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa