టెన్త్ క్లాస్ పరీక్షలు జరుగుతుండగా సోషల్ మీడయాలో ప్రశ్నాపత్రం కలకలం రేపింది. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. శనివారం విద్యార్థులు పదవ తరగతి హిందీ పరీక్ష రాస్తుండగానే అదే ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో కనిపించింది. ప్రశ్నాపత్రంతో పాటుగా కొన్నింటికి సమాధానాలు కూడా ఉన్నాయి. ఈ విషయం విద్యాశాఖ అధికారులకు తెలిసింది. దీంతో ప్రశ్నాపత్రం లీకేజీపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని గుజరాత్ విద్యాశాఖ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa