19 ఏళ్ల రాజకీయ కల బాపట్ల జిల్లా ఆవిర్భావం తో నెరవేరిందని కోన రఘుపతి అన్నారు ఆదివారం రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై ఆయన మాట్లాడారు. నాకు పదవుల కంటే బాపట్ల జిల్లా కావడమే ముఖ్యమన్నారు. బాపట్ల జిల్లా కోసం అహర్నిశలు శ్రమించానని జిల్లా రావడమే ముఖ్యమని చెప్పారు. తన తండ్రి కోన ప్రభాకరరావు హయాంలో నల్లగొండ జిల్లా చేయాలనే కోరిక నెరవేరిందని , బాపట్ల జిల్లా స్థాయికి తగిన విధంగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. ప్రజా సేవ చేసేందుకు పదవులు ప్రధానం కాదని చెప్పిన కోన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అద్భుతంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నూతనంగా ఏర్పడిన మంత్రివర్గంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. మంత్రి పదవి కోసం తాను పాకులాడబోనని జిల్లా కేంద్రమైన బాపట్లకు ఎమ్మెల్యేగా కొనసాగదంలోనే మరింత ఆనందంగా ఉంటుందని చెప్పారు. అన్ని సామాజిక తరగతులు బేరీజు వేసుకుని వారికి న్యాయం చేసేలా సీఎం నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.