ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒకరికి లవ్ ఫెయిల్యూర్.. ఆరుగురు ఆత్మహత్యాయత్నం

national |  Suryaa Desk  | Published : Tue, Apr 12, 2022, 11:31 AM

ఒకిరి ప్రేమ విఫలం కావడంతో అది తట్టుకోలేక మరో ఐదుగురు విషం తాగేశారు. ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురు చనిపోగా, మరో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ విషాదకర ఘటన బిహార్‌లోని ఔరంగాబాద్‌ జిల్లాలో కస్మా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన ఓ బాలిక ప్రేమలో ఉంది. ఆమె తన అన్న బావమరిదినే ప్రేమించింది. తన ప్రేమను అతడికి తెలియజేయాలని అనుకుంది. అతడి దగ్గరకు తన ఐదుగురు స్నేహితురాళ్లతో కలిసి వెళ్లింది. అయితే ఆ అమ్మాయి ప్రేమను ఆ యువకుడు తిరస్కరించాడు. ప్రేమ విఫలమైందనే బాధలో ఆ బాలిక విషం తాగేసింది. తమ స్నేహితురాలు అలా చేయడం తట్టుకోలేని మిగిలిన బాలికలు కూడా అదే విషాన్ని తాగేశారు. ముగ్గురు బాలికలు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఔరంగాబాద్ ఎస్పీ కాంతేష్ కుమార్ మిశ్రా స్పందించారు. ఘటనపై విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com