మంచిర్యాల జిల్లా: శ్రీరాంపూర్ లో దారుణం జరిగింది. కన్న కుమారుడిని తండ్రే హతమార్చిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే. స్థానిక ఆర్కే 6 గుడిసెల ప్రాంతంలో నివసిస్తున్న కనుకుంట్ల కొమురయ్య తన కుమారుడు కుమార్‌పై కర్రతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. గత కొంతకాలంగా కుటుంబ కలహాలతో తండ్రి కొమురయ్య ఈ హత్యకు పాల్పడ్డాడు. కొడుకు కుమార్‌ను హత్య చేసిన తండ్రి కొమురయ్య పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.