రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను గాలికి వదిలేసిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్య నారాయణరాజు విమర్శించారు. మంగళవారం జయహోటల్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఆర్భాట ప్రచారంచేస్తున్న వైసిపి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పోలవరం పేరు చెప్పి కేంద్రం నిధులు కేటాయించాలని చెబుతూ మిగతా ప్రాజెక్టులను రాష్ట్రప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.