స్పందన అర్జీల పట్ల సకాలంలో స్పందించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె. వి ఎన్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ స్పందన కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిరోజు కొంత సమయం కేటాయించి స్పందన అర్జీలను పరిష్కరించేందుకు కృషి చేయాలని ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు దాటకుండా చూడాలని సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాలలో పౌరులకు సేవలు కొన్ని శాఖలు బాగా అందిస్తున్నాయని ముఖ్యంగా 24 గంటలు, 48 గంటల్లో పరిష్కరించాల్సినవి ప్రతిరోజు పర్యవేక్షించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.