యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఒకేసారి ఏకకాలంలో రెండు డిగ్రీ కోర్సులు కొనసాగించవచ్చని తెలిపింది. అది కూడా ఫిజికల్ మోడ్ లో వేర్వేరు వర్శిటీల నుంచి చేసుకోవచ్చని పేర్కొంది. నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను జారీ చేయనున్నారు. ఈ విషయాన్ని యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి కమిషన్ త్వరలో వివరణాత్మకంగా మార్గదర్శకాలు జారీ చేస్తుందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa