ఐపీఎల్ 2022లో మంగళవారం చెన్నై , బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో బెంగళూరుపై 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 217 పరుగుల భారీ లక్ష్యంలో ఆర్సీబీ 193/9కే పరిమితమైంది. ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్ 8 పరుగులు చేసాడు, అనుజ్ రావత్ 12 పరుగులు , విరాట్ కోహ్లీ (1) సహా మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. అయితే గ్లెన్ మ్యాక్స్ వెల్ 26 పరుగులు చేసాడు , షాబాజ్ అహ్మద్ 41 పరుగులు చేసాడు, సుయాష్ ప్రభుదేశాయ్ 34 పరుగులు చేసాడు, దినేష్ కార్తీక్ 34 పరుగులు చేసాడు. మహ్మద్ సిరాజ్ 14, జోష్ హేజిల్‌వుడ్ 7 నాటౌట్‌గా నిలిచారు. చెన్నై బౌలర్లలో మహేశ్ తీక్షణ 4 వికెట్లు, రవీంద్ర జడేజా 3 వికెట్లు తీశారు. ముఖేష్, బ్రేవో చెరో వికెట్ తీశారు. అయితే ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. చెన్నై బ్యాటర్లలో శివమ్ దూబే 95*, రాబిన్ ఉతప్ప 88 పరుగులతో రాణించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa