ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ అందించింది. జోన్ పరిధిలో 'హాలిడే స్పెషల్ ట్రైన్స్' పేరుతో 19 రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. మొత్తం 19 రైళ్లలో విజయవాడ-సికింద్రాబాద్ మధ్య ఒకరైలు మంగళవారం బయలుదేరింది. ఏప్రిల్ 13న హైదరాబాద్-నర్సాపూర్, కాచిగూడ-తిరుపతి, సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-కాకినాడటౌన్, సికింద్రాబాద్-బరంపురం మార్గాల్లో ఐదు రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 14న నర్సాపూర్-సికింద్రాబాద్, తిరుపతి-కాచిగూడ, తిరుపతి-సికింద్రాబాద్, కాకినాడటౌన్-తిరుపతి, నాందేడ్-తిరుపతి, బరంపురం-సికింద్రాబాద్ మార్గాల్లో ఆరు రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది. 15న తిరుపతి-కాకినాడటౌన్, తిరుపతి-సికింద్రాబాద్, సికింద్రాబాద్-నర్సాపూర్ మధ్య 3 రైళ్లను, 16న సికింద్రాబాద్-తిరుపతి మధ్య, 17న నర్సాపూర్-సికింద్రాబాద్, కాకినాడటౌన్-వికారాబాద్, తిరుపతి-సికింద్రాబాద్ మధ్య మూడు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ప్రయాణికులంతా స్పెషల్ ట్రైన్లను ఉపయోగించుకోవాలని కోరింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa