పాకాల మండలం మొగరాల సమీపంలో పొలాల్లో ఉన్న బావి దగ్గరకు వెళ్ళిన విద్యార్థి, జారి ప్రమాదవశాత్తు బావిలో పడి గల్లంతైన సంఘటన మంగళవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో చోటు చేసుకున్న సంఘటన విధితమే. స్థానికుల సమాచారం మేరకు మొగరాల గ్రామంకు చెందిన డి. మహమ్మద్ అలీ కుమారుడు డి. దినేష్ ( 14 ) 9 వ తరగతి చదువుతున్నాడు. ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడు. విషయం తెలుసుకున్న వెంటనే స్థానిక అధికారులకు ఫైర్, పోలీస్ స్టేషన్ సిబ్బందికి, తెలియజేయడంతో వారు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని, బాలున్ని వెలికి తీసే ప్రయత్నం చేశారు.
బావి నిండా నీరు ఉండడంతో రెండు రోజులుగా మోటర్లు సహాయంతో నీరును బయటకు వదిలి మూడోరోజు తర్వాత మృతదేహంను వెలికి తీశారు. ఫైర్ స్టేషన్ ఏ. ఎస్. ఎఫ్. ఓ విశ్వనాదం , పాకాల ఎస్. ఐ వంశీధర్ , ఎస్. ఐ -2 రామకృష్ణ , ఏ. ఎస్. ఐ నారాయణస్వామి , సిబ్బంది కలిసి బాలుడు మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిరుపేద కుటుంబానికి చెందిన దినేష్ తల్లిదండ్రులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.