ఏపీలోని ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. ఓ విద్యార్థి తన ఫోన్ లో ఓ విద్యార్థిని నగ్నచిత్రాలను తీశాడు. ఆ ఫోటోలను మరో యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ దారుణంపై ఫిర్యాదు అందడంతో పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దదోర్నాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన దూదేకుల నాగూర్ మీరావలి (19) డిప్లమో చదువుతున్నాడు. మరో గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని తన స్నేహితురాలి బర్త్ డే వేడుకల కోసం ఇటీవల మార్కాపురం వచ్చింది. ఆమెతో మీరావలికి పరిచయం ఉంది. దీంతో ఆమెను కూల్ డ్రింక్ తాగుదామంటూ పిలిచాడు. అందులో మత్తు పదార్థం కలిపి ఇచ్చాడు. దీంతో ఆ విద్యార్థిని స్పృహ తప్పి పడిపోయింది. మీరావలి ఆ విద్యార్థినిని వివస్త్రను చేసి ఫోన్ లో ఫోటోలు తీశాడు. ఆ ఫోటోలను చూసిన మీరావలి స్నేహితుడు, మోకానిక్ డి.రసూల్(22) వాటిని సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారాయి. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు, గ్రామస్థులు బుధవారం రాత్రి పెద్దదోర్నాల పోలీస్స్టేషన్ కు చేరుకుని విషయాన్ని తెలిపారు. పోలీసులు వారి నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. నాగూర్ మీరావలి, రసూల్ ను అరెస్టు చేశారు.