ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, ఆయన సతీమణి ఉషా నాయుడు శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని ఆలయ నగరాలైన అయోధ్య, వారణాసిలను సందర్శించారు. వెంకయ్యనాయుడు ప్రత్యేక రైలులో లక్నో నుంచి అయోధ్య చేరుకున్నారు. అయోధ్య రైల్వే స్టేషన్లో ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, ఫైజాబాద్ ఎంపీ లల్లూ సింగ్, ఇతర ప్రజాప్రతినిధులు వారికి స్వాగతం పలికారు.ప్రముఖ హనుమాన్‌గర్హి ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు.అనంతరం సాయంత్రం ప్రత్యేక రైలులో నాయుడు వారణాసి చేరుకున్నారు.