అమరావతి మండలం జూపూడి గ్రామం లో వడ్డెర్ల పై దాడి చేసిన వైసీపీ కార్యకర్తలను వెంటనే అరెస్ట్ చేయాలని పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికార పార్టీ కార్యకర్తలను, నాయకులను అరెస్టు చేయాలన్నారు.
అరెస్టు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామన్నారు. అనంతరం పోలీస్ అధికారులతో మాట్లాడి దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని కోరారు. ఆయనతో పాటు టిడిపి నాయకులు విష్ణు, వసంతరావు, శివలీల జానీ, తదితరులు పాల్గొన్నారు.