అబ్దుల్లాపూర్ మేట్ మండలం పరిధిలోని గుంతపల్లి గ్రామంలో గల సీతారామాంజనే యస్వామి దేవాలయంలో. శనివారం(ఈరోజు) సాయంత్రం శ్రీ సీతారాముల కల్యాణోత్స వాన్ని నిర్వహించనున్నట్లు సర్పంచ్ కరిమెల వెంకటేష్ తెలిపారు. సాయంత్రం 6గంటలకు స్వామివారి కల్యాణం, ఆదివారం ఉదయం రథోత్సవాలను జరుపనున్నామని, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి హాజరయ్యే ఈ వేడుకలకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.