జగనన్నను గెలిపిస్తే చార్జీల భారంతో పేదలను బాదేస్తూ వారి బతుకులను బుగ్గిపాలు చేశారని టీడీపీ నగర నియోజకవర్గ ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నారు. నెల్లూరు నగరంలోని 6వ డివిజన్‌లోని అరుంధతీయ కాలనీలో శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరిగిన ధరలతో పేదలు నిత్యం అనేక అవస్థలు పడుతున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. అప్పడే ప్రజల జీవీతాలు గాడిలో పడతాయన్నారు. కార్యక్రమంలో ధర్మవరం సుబ్బారావు, మామిడాల మధు, కప్పిర రేవతి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa