నగర ప్రజలు జియంసికి చెల్లించవలసిన బకాయిలను చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని, నగర మేయర్, కమిషనర్ కోరారు. రోజురోజుకు నగరపాలక సంస్థ పరిది విస్తరిస్తుంది. ఈనేపథ్యంలో ప్రజలు, గుంటూరు నగరపాలక సంస్థ కు చెల్లించవలసినా, 2022, 2023 సంవత్సరానికి ఆస్తిపన్ను, ఇంటిపన్ను, నీటిపన్నులను ఏప్రిల్30వ తేదీలోపు చెల్లించి, 5శాతం రాయితీ పొందవచ్చని, ఆదివారం ఉదయం నగరపాలక మేయర్ కావటి మనోహర్ నాయుడు, నగర కమిషనర్ కీర్తి ప్రజలకు తెలిపారు.