ప్రాతకోట గ్రామం, పగిడ్యాల మండలం, నంద్యాల జిల్లాలో ఆజాది కా అమృత్ మహోత్సవ్ మరియు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య వికాస కేంద్రాల ఆవిష్కరణ వార్షికోత్సవము పి. హెచ్. సీ వైద్యాధికారులు ఐన డాII జి. కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
ఇందులో ఎమ్. ఎల్. హెచ్. పి. లు శ్రీమతి కె. బీసమ్మ మరియు శ్రీ ఏ. తెనాలి రామకృష్ణ మాట్లాడుతూ. ప్రస్తుత దైనందిన జీవితంలో యోగా మరియు వ్యాయామ చర్యలు నిత్యం పాటించడం వలన చాలా రకాల వ్యాధులను అరికట్టవచ్చునని , తమ దగ్గర్లో ఏర్పాటు చేసిన ఆరోగ్య వికాస కేంద్రాల్లో సేవలను సద్వినియొగం చేసుకోవాలని పేర్కొన్నారు.