ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ చక్రవర్తి పర్యవేక్షణలో లో , నూజివీడు డి ఎస్ పి శ్రీనివాసులు ఆధ్వర్యంలో నూజివీడు సి ఐ అంకబాబు సూచనల మేరకు ఆదివారం నూజివీడు మండలం దేవరగుంట గ్రామంలో గల గుట్ట ప్రాంతంలో నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించి సదరు స్థావరాల వద్ద ఉన్న 1400 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేయడమైనది. 10 లీటర్లు సారా ను స్వాధీనం చేసుకొనడమైనది. ఎవరైనా నాటుసారా తయారీ చేసిన, అమ్మిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొనబడును. నాటు సారా తయారి మరియు అమ్మిన వారికి సంబంధించిన సమాచారం ఎవరైనా తెలియజేసిన వారి యొక్క వివరాలను గోప్యంగా ఉంచబడును. ఈ కార్యక్రమంలో నూజివీడు రూరల్ ఎస్ ఐ లక్ష్మణ్, పిసి ఉదయ్ కుమార్ మరియు హెచ్ జి నాగరాజు పాల్గొన్నారు.