చిన్నగంజాం సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన ద్విచక్ర వాహనదారుడు ఎవరో తెలియరాలేదని ఎస్సై నాగబాబు చెప్పారు. అతన్ని గుర్తించడానికి ఎటువంటి ఆనవాళ్లు లేవన్నారు.
AP 27 BX 2461 నెంబరు గల ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ అతడు ప్రమాదానికి గురై మరణించాడని ఆయన వివరించారు. ఈ వాహన యజమాని గానీ, మృతుడి వివరాలు తెలిసిన ఇతరులుగానీ వెంటనే తనను సంప్రదించాలని కోరారు. మృతదేహం చీరాల మార్చురీలో ఉందని ఎస్సై నాగబాబు చెప్పారు.