చీరాల మున్సిపాలిటీ శానిటరీ సిబ్బంది నిర్వాకం వెలుగు చూసింది. జనావాసాల మధ్య పట్టణం నడిబొడ్డున ఒక మూగజీవి మృతదేహాన్ని వారు ఖననం చేసిన వీడియోలు బయటకు వచ్చాయి.
రెండు రోజుల క్రితం ఒక గో మాత రైల్వేస్టేషన్ సమీపంలో మరణించింది. ఈ విషయాన్ని మున్సిపల్ అధికారులకు మీడియా కూడా తెలియజేయడం జరిగింది. రెండు రోజుల తర్వాత మున్సిపల్ సిబ్బంది తాపీగా స్పందించారు
అయితే ఆ మృతదేహాన్ని ఊరి శివార్లకు తరలించకుండా చీరాల ఇన్చార్జ్ శానిటరీ అధికారి రాజా ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు పట్టణ నడిబొడ్డున ఉన్న డ్రైనేజీ గెస్ట్ హౌస్ సమీపంలో ఖాళీగా ఉన్న ప్రదేశంలో గుంత తీసి అక్కడే పూడ్చేశారు. ఇది వారి నిర్లక్ష్యానికి పరాకాష్ట అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.